నాకు అవార్డు ఇస్తానంటే... ఆ వేడుకకు వెళ్లను. అవార్డులు కొత్తవారికి ఇస్తేనే బాగుంటుంది’’ అన్నారు ప్రముఖ నటుడు చిరంజీవి. ఇటీవల హైదరాబాద్‌లో
సంతోషం సౌత్ ఇండియన్ ఫిలిం అవార్డుల ప్రదానోత్సవం జరిగింది. చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ‘ఖైదీ నెం.150’ చిత్రానికి గాను ఉత్తమ నటుడిగా ప్రముఖ గాయని జానకి చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు. అనంతరం చిరంజీవి మాట్లాడుతూ ‘‘నాకు అవార్డు ఇవ్వను అంటేనే ఈ కార్యక్రమానికి వస్తానని నిర్వాహకుడు సురేష్ కొండేటికి ముందే చెప్పా. ‘సరే..’ అని మాటిచ్చారు. తీరా చూస్తే జానకి గారి చేతుల మీదుగా అవార్డు అందించి మోసం చేశారు. ఆమె చేతుల మీదుగా పురస్కారం అందుకున్నందుకు గర్వంగానూ ఉంది. అవార్డులు కొత్తవారికి ఇవ్వాలి. అవి వాళ్లలో ఉత్సాహాన్ని నింపుతాయి. మరింత మందికి స్ఫూర్తి అందిస్తాయి’’ అన్నారు. జానకి మాట్లాడుతూ ‘‘చిరంజీవి నటించిన చాలా చిత్రాలకు పాటలు పాడాను. ఆయనలో ఎలాంటి మార్పు రాలేదు’’ అన్నారు. తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ మాట్లాడుతూ ‘‘పదహారేళ్లుగా ‘సంతోషం’ అవార్డులు అందిస్తున్నారు. దక్షిణాది నటీనటులు, సాంకేతిక నిపుణుల్ని ఒకే వేదికపైకి తీసుకొచ్చి గౌరవించడం ఆనందంగా ఉంద’’న్నారు. ఈ కార్యక్రమంలో కె.రాఘవేంద్రరావు, అల్లు అరవింద్, రాజేంద్రప్రసాద్, సురేష్‌బాబు, తమన్నా, ప్రసన్న, స్నేహా, మెహరీన్ తదితరులతో పాటు అవార్డు గ్రహీతలు పాల్గొన్నారు.

విజేతలు వీళ్లే:
ఉత్తమ నటి: శ్రియ (గౌతమిపుత్ర శాతకర్ణి), ఉత్తమ దర్శకుడు: సంకల్ప్‌రెడ్డి (ఘాజీ), ఉత్తమ ఛాయాగ్రాహకుడు: సెంథిల్ కుమార్ (బాహుబలి), ఉత్తమ మాటల రచయిత: బుర్రాసాయిమాధవ్ (గౌతమిపుత్ర శాతకర్ణి), ఉత్తమ సహాయ నటుడు: నరేష్ (శతమానం భవతి), జీవన సాఫల్య పురస్కారం: ఎస్.జానకి
అల్లు రామలింగయ్య స్మారక పురస్కారం - బ్రహ్మాజీ
అక్కినేని నాగేశ్వరరావు స్మారక పురస్కారం - రాజేంద్రప్రసాద్
శ్రీదేవి స్మారక పురస్కారం - తమన్నా
రామానాయుడు స్మారక పురస్కారం - మైత్రీ మూవీ మేకర్స్
ఉత్తమ నటుడు - చిరంజీవి (ఖైదీ నంబర్ 150)
ఉత్తమ నటి - శ్రియా శరణ్ (గౌతమిప్రుత శాతకర్ణి)
ఉత్తమ దర్శకుడు - సంకల్ప్ రెడ్డి (ఘాజీ)
ఉత్తమ ఛాయాగ్రాహకుడు - సెంథిల్ కుమార్ (బాహుబలి)
ఉత్తమ కొరియోగ్రాఫర్ - శేఖర్ మాస్టర్ (ఖైదీ నంబర్ 150)
ఉత్తమ మాటల రచయిత - బుర్రా సాయిమాధవ్ (గౌతమిపుత్ర శాతకర్ణి)
ఉత్తమ ఫైట్ మాస్టర్ - రామ్ లక్ష్మణ్ (ఖైదీ నంబర్ 150)
ఉత్తమ గాయకుడు - రేవంత్ (అర్జున్ రెడ్డి)
ఉత్తమ సహాయ నటుడు - సీనియర్ నరేష్ (శతమానం భవతి)
ఉత్తమ హీరో (తొలిపరిచయం) - రక్షిత్ (లండన్ బాబులు)
స్పెషల్ జ్యూరీ ఫర్ బెస్ట్ హీరోయిన్ - మెహరీన్ (మహానుభావుడు)
స్పెషల్ జ్యూరీ ఫర్ బెస్ట్ హీరోయిన్ - ఈషా రెబ్బా(అమీతుమీ)
తమిళం
జీవితసాఫల్య పురస్కారం - టి.రాజేందర్
ఉత్తమ సహానటుడు - ప్రసన్న (హీరోయిన్ స్నేహ భర్త)
కన్నడ
ఉత్తమ చిత్రం - ఉర్వి (నిర్మాత బీఎస్ ప్రదీప్ వర్మ)
ఉత్తమ దర్శకుడు - అలమేరి సంతు(కాలేజ్ కుమార్)
ఉత్తమ నటి - నివేదిత(శుద్ధి)
ఉత్తమ సంగీత దర్శకుడు - బీజే భరత్(బ్యూటిఫుల్ మనసుగలు)
ఉత్తమ గాయని - అనురాధా భట్(చౌక)
ఉత్తమ సహాయనటుడు - దత్తాత్రేయ(కెంపిర్వే)
ఉత్తమ సహాయ నటి - అరుణ బాల్‌రాజ్(ఆపరేషన్ అలమేలమ్మ)
ఉత్తమ హీరో (క్రిటిక్స్ అవార్డు) - ప్రవీణ్ తేజ్(చురికతే)
మలయాళం
ఉత్తమ చిత్రం - తొండిముతులం ద్రిక్షశుయుం (నిర్మాత సందీప్ సేనన్)
ఉత్తమ దర్శకుడు - అరుణ్ గోపీ (రామ్ లీలా)
ఉత్తమ నటుడు - ఇంద్రన్స్
ఉత్తమ నటి - ప్రయాగరోస్ మార్టిన్ ( రామ్ లీలా)
యూత్ ఐకాన్-2017(ఫీమేల్) - నిమిషా సజయన్ (తొండిముతులం ద్రిక్షశుయుం)
యూత్ ఐకాన్-2017 (మేల్) - ధృవ్(క్వీన్)
ఉత్తమ సహాయ నటి - కృష్ణప్రభ(హనీబీ-2)
ఉత్తమ సహాయ నటుడు - ఆన్సన్ పాల్(సోలో)

No comments:
Post a Comment